👉 ఐరోపా వారు ఆసియా దేశాలపై ఆధారపడుటకు గల ప్రధాన కారణం ‘సుగంధ ద్రవ్యాలు (Spices)’.
📌 నోట్:
- సుగంధద్రవ్యాల రారాజు, యవ్వన ప్రియా అని మిరియాలను పిలుస్తారు.
- సుగంధద్రవ్యాల రాణి అని యాలకులను పిలుస్తారు.
- జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు (National Spice Board) ‘కోచ్చి’లో కలదు.
👉 ఐరోపా ఆధునిక యుగ ఆరంభానికి ముఖ్య కారణం పారిశ్రామిక విప్లవం.
📌 నోట్:
- పారిశ్రామిక విప్లవం అను పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి లూయి బ్లాంక్.
- పారిశ్రామిక విప్లవ ఫలితంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ లేదా జౌళి పరిశ్రమ.
- పారిశ్రామిక విప్లవం ఆధునిక ఆవిరియంత్రం కనుగొన్న అనంతరం వేగాన్ని అందుకొన్నది.
- ఆధునిక ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది – జేమ్స్ వాట్.
- Safety Lamp కనుగొన్నది – హంఫ్రీడేవి.
👉 ప్రాచీన కాలం నుండి భారతదేశానికి, ఐరోపా దేశాలకు భూ మార్గం ద్వారా వ్యాపారం నిర్వహించబడుతుండేది.
👉 భారతదేశానికి, ఐరోపా దేశాలకు మధ్య ముఖ్య రహదారి సిల్క్ రూట్.
👉 మధ్యయుగంలో అరబ్బులు భారత్, చైనా దేశాలతో వ్యాపారాన్ని నిర్వహించేవారు.
📌 నోట్:
- అరబ్బులను భారతీయ సంస్కృతి రాయబారులు అని వ్యవహరిస్తారు.
- ఆంధ్రదేశంలో చైనా ఓడలకు గల పేరు జోంగులు.
👉 చివరి క్రూసేడు యుద్ధంలో తురుష్కులు టర్కీలోని కాన్స్టాంట్ నోపుల్ (ఇస్తాంబుల్) నగరంను క్రీ.శ. 1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ (బైజంటైన్ చక్రవర్తి కాన్స్టాంటైన్-XI ని ఓడించి) ఆక్రమించి ఐరోపా, ఆసియా ఖండాల మధ్య గల భూ మార్గాన్ని మూసివేశారు. యూరోపియన్ వర్తకులు ఎవ్వరూ భారతదేశం (లేదా) తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించారు. దీనితో యూరోపియన్లు భారతదేశంతో నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనుటకు నిర్ణయించారు.
📌 నోట్:
- క్రైస్తవులకు, ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలను “క్రూసేడులు” అంటారు. క్రూసేడు యుద్ధాలకు కారణమైన పవిత్రనగరాలు “పాలస్తీనా, జెరుసలేం, బెత్లహేం”.
- కాన్‌స్టాంట్‌నోపుల్ నగరంను ప్రస్తుతం ఇస్తాంబుల్ అని వ్యవహరిస్తున్నారు.
👉 భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన మొట్టమొదటి ఐరోపా వారు “పోర్చుగీసువారు”.
👉 పోర్చుగల్ రాజు “ఇన్ఫాంటే హెన్రీ” మొదటగా యూరప్‌లో నౌకాయానాన్ని ప్రోత్సహించాడు.
📌 నోట్:
- హెన్రీ పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేశాడు.
- హెన్రీకి ‘ది నేవిగేటర్’ అనే బిరుదు కలదు.
- హెన్రీ జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో దేశంను చేరుకొని సురక్షితంగా తిరిగి స్పెయిన్‌కు వెళ్ళాడు.
👉 క్రీ.శ. 1483లో ఇండియాకు రావాలని బయలుదేరిన మొదటి పోర్చుగీసు వ్యక్తి “బార్తిలోమియో డయాజ్”. ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తుఫానులతో వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో డయాజ్ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయి ఈ ప్రాంతానికి “తుఫానుల అగాధం (ఆగ్రం) (Cape of Stroms)” అని పేరు పెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
📌 నోట్: తుఫానుల ఆగ్రంకు “కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good hope)” అని పేరు పెట్టినది “రెండవ జాన్ (పోర్చుగల్ చక్రవర్తి)”.
👉 క్రీ.శ. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్ మహా సముద్రంలో తన దిశమారి కరేబియన్ దీవులను చేరుకొని ఆ దీవులకు “వెస్టిండీస్” అని పేరుపెట్టాడు.
📌 నోట్:
- కొలంబస్ పశ్చిమ తీరం గుండా బయలుదేరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే క్రమంలో బహుమాస్ దీవులకు (1493లో) చేరుకున్నాడు.
- కొలంబస్ భారతదేశానికి బదులుగా అమెరికాను కనిపెట్టాడు.
- కొలంబస్ ఉపయోగించిన ముఖ్యనౌక – శాంతమారియా.
- ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి బహమాస్ దీవులకు చేరుకొని ఇది భారతదేశం కాదని ఒక నూతన ఖండం అని ప్రపంచానికి తెలియజేశాడు. అమెరిగో వెస్పూచి పేరుపై ఆ ప్రాంతానికి అమెరికా అని పేరు వచ్చింది.
👉 వాస్కోడిగామా భారతదేశంనకు సముద్ర మార్గంను కనుగొనుటకై పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి బయలుదేరి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకుని అక్కడ అబ్దుల్ మజీద్ (గుజరాతి నావికుడు) సహాయంతో 1498, మే 17న కాలికట్ (కోజికోడ్) చేరుకున్నాడు.
📌 నోట్: నేటి కేరళలోగల కాలికట్ ‘మలబారు తీరం’లో ఉంది. నాటి కాలికట్ పరిపాలకుడు జామోరిన్.
👉 కాలికట్ రాజు జామోరిన్ వాస్కోడిగామాకు స్వాగతం పలికి కావలసిన వస్తువులను బహుమతిగా ఇచ్చి యూరప్‌కు పంపించాడు. ఈ వస్తువులను తమ దేశంలో అమ్మగా 60 రెట్ల లాభం లభించింది.
👉 వాస్కోడిగామాతో 64 మంది నావికులు, 3 నౌకలు వచ్చాయి. అవి:
- Sao Gabriel – Vascodagama
- Sao Rafel – Paulo dagama
- Caravel Berrio – Nicalau colho
👉 వాస్కోడిగామా ప్రయాణించిన మార్గానికి గల పేరు – Cape root.
👉 వాస్కోడిగామా రెండవసారి భారతదేశానికి 1502, అక్టోబర్‌లో తన సోదరుడైన ‘ఎస్టవోడాగామా’తో కాలికట్ వచ్చాడు. ఇతను 1524, డిసెంబర్ 24న కోచ్చిలో మలేరియా వ్యాధితో మరణించాడు. ఇతనికి కొచ్చిలోని St. Francis Anthony’s చర్చి వద్ద సమాధి చేశారు. 1539లో ఈ సమాధిని లిస్బన్‌కు మార్చారు.

1. పోర్చుగీసువారు (1498)
👉 భారతదేశానికి వచ్చిన మొదటి ఐరోపా వారు పోర్చుగీసువారు. (వాస్కోడిగామా 1498, మే 17న కాలికట్ చేరుకున్నాడు)
👉 ఆ కాలం నాటి కాలికట్ రాజు “జామెరిన్”. ఇతని అసలు పేరు “రాజుమను విక్రమవర్మన్”. ఇతని బిరుదు సముద్రిక. రాజధాని పొన్నాని.
👉 ఆ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ “సికిందర్ లోడి”. 👉 అప్పటి విజయనగర రాజు “ఇమ్మడి నరసింహరాయలు”.
👉 భారతదేశంలో పోర్చుగీసువారి యొక్క మొదటి వ్యాపార స్థావరం కాలికట్ (క్రీ.శ. 1500)
👉 పోర్చుగీసు వ్యాపార కంపెనీకి గల పేరు ఎస్టోడా ఇండియా.
👉 పోర్చుగీసు వారి ప్రధాన వ్యాపార స్థావరం కొచ్చిన్. 📌 నోట్: 1501 స్థావరం, 1502 హెడ్ క్వార్టర్స్ చేయబడింది.
👉 పోర్చుగీసువారు పశ్చిమతీర ప్రాంతంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. 👉 పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు:
