1. భారతదేశానికి యూరోపియన్ల రాక 🚢
- 🌍 ఐరోపా ఆసియా దేశాలపై ఆధారపడుటకు గల ప్రధాన కారణం ‘సుగంధ ద్రవ్యాలు (Spices)’.
📌 నోట్:
- 🌶️ సుగంధద్రవ్యాల కార్రాజు, యవ్వన ప్రియా అని మిరియాలను పిలుస్తారు.
- 🌱 సుగంధద్రవ్యాల రాణి అని యాలకులను పిలుస్తారు.
- 🏢 జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు (National Spice Board) ‘కోచ్చి’ లో కలదు.
- 🏭 ఐరోపా ఆధునిక యుగ ఆరంభానికి ముఖ్య కారణం పారిశ్రామిక విప్లవం.
📌 నోట్:
- 🗣️ పారిశ్రామిక విప్లవం అను పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి లూయి బ్లాంక్.
- 🧵 పారిశ్రామిక విప్లవ ఫలితంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ లేదా జౌళి పరిశ్రమ.
- 🚂 పారిశ్రామిక విప్లవం ఆధునిక ఆవిరియంత్రం కనుగొన్న అనంతరం వేగాన్ని అందుకొన్నది. (ఆవిరి యంత్రం – జేమ్స్ వాట్)
- ⚙️ ఆధునిక ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది – జేమ్స్ వాట్.
- 💡 Safty Lamp కనుగొన్నది – హంప్రిదేవి.
- 🐪 ప్రాచీన కాలం నుండి భారతదేశానికి, ఐరోపా దేశాలకు భూ మార్గం ద్వారా వ్యాపారం నిర్వహించబడుతుండేది.
- 🛣️ భారతదేశానికి, ఐరోపా దేశాలకు మధ్య ముఖ్య రహదారి సిల్క్ రూట్.
- 🤝 మధ్యయుగంలో అరబ్బులు భారత్, చైనా దేశాలతో వ్యాపారాన్ని నిర్వహించేవారు.
📌 నోట్:
- 🕊️ అరబ్బులను భారతీయ సంస్కృతి రాయబారులు అని వ్యవహరిస్తారు.
- ⛵ ఆంధ్రదేశంలో చైనా ఓడలకు గల పేరు జోంగులు.
- ⚔️ చివరి క్రూసేడు యుద్ధంలో తురుష్కులు టర్కీలోని కాన్స్టాంట్ నోపుల్ (ఇస్తాంబుల్) నగరంను క్రీ.శ.1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ (బైజంటైన్ చక్రవర్తి (కాన్స్టాంటైన్ XI)ని ఓడించి) ఆక్రమించి ఐరోపా, ఆసియా ఖండాల మధ్య గల భూ మార్గాన్ని మూసివేశారు.
- 🚫 యూరోపియన్ వర్తకులు ఎవ్వరూ భారతదేశం (లేదా) తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించారు. దీనితో యూరోపియన్లు భారతదేశంతో నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనుటకు నిర్ణయించారు.
📌 నోట్:
- ✝️☪️ క్రైస్తవులకు, ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలను “క్రూసేడులు” అంటారు. క్రూసేడు యుద్ధాలకు కారణమైన పవిత్రనగరాలు “పాలస్తీనా, జెరుసలేం, బెత్లహేం”.
- 🏙️ కాన్‌స్టాంట్‌నోపుల్ నగరంను ప్రస్తుతం ఇస్తాంబుల్ అని వ్యవహరిస్తున్నారు.
- 👑 కాలికట్ రాజు జామోరిన్ వాస్కోడిగామాకు స్వాగతం పలికి కావలసిన వస్తువులను బహుమతిగా ఇచ్చి యూరప్‌కు పంపించాడు. ఈ వస్తువులను తమ దేశంలో అమ్మగా 60 రెట్ల లాభం లభించింది.
- 🌊 భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన మొట్టమొదటి ఐరోపా వారు “పోర్చుగీసువారు”.
- 🤴 పోర్చుగల్ రాజు “ఇన్ఫాంటే హెన్రీ” మొదటగా యూరప్ నౌకాయానాన్ని ప్రోత్సహించాడు.
📌 నోట్:
- 🏫 హెన్రీ పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేశాడు.
- 🏅 హెన్రీకి ‘ది నేవిగేటర్’ అనే బిరుదు కలదు. (హెన్రీ – ది నేవిగేటర్)
- 🗺️ హెన్రీ జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో దేశంను చేరుకొని సురక్షితంగా తిరిగి స్పెయిన్‌కు వెళ్ళాడు.
- 🌪️ క్రీ.శ.1483లో ఇండియాకు రావాలని బయలుదేరిన మొదటి పోర్చుగీసు వ్యక్తి “బర్తిలోమియో దయాజ్”. ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తుఫానులతో వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో డయాజ్ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయి ఈ ప్రాంతానికి “తుఫానుల అగాధం (ఆగ్రం) (Cape of Stroms)” అని పేరు పెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
📌 నోట్: తుఫానుల ఆగ్రంకు “కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good hope)” అని పేరు పెట్టినది “రెండవ జాన్ (పోర్చుగల్ చక్రవర్తి)”.
- 🌎 క్రీ.శ.1492లో క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్ మహా సముద్రంలో తన దిశమారి కరేబియన్ దీవులను చేరుకొని ఆ దీవులకు “వెస్టిండీస్” అని పేరుపెట్టాడు.
📌 నోట్:
- 🧭 కొలంబస్ పశ్చిమ తీరం గుండా బయలుదేరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే క్రమంలో బహుమాస్ దీవులకు (1493లో) చేరుకున్నాడు.
- ❌ కొలంబస్ భారతదేశానికి బదులుగా అమెరికాను కనిపెట్టాడు.
- ⛵ కొలంబస్ ఉపయోగించిన ముఖ్యనౌక- శాంతమారియా.
- 🌍 ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి బహమాస్ దీవులకు చేరుకొని ఇది భారతదేశం కాదని ఒక నూతన ఖండం అని ప్రపంచానికి తెలియజేశాడు. అమెరిగో వెస్పూచి పేరుపై ఆ ప్రాంతానికి అమెరికా అని పేరు వచ్చింది.
- ⚓ వాస్కోడిగామా భారతదేశంనకు సముద్ర మార్గంను కనుగొనుటకై పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి బయలుదేరి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకుని అక్కడ అబ్దుల్ మజీద్ (గుజరాతి నావికుడు) సహాయంతో 1498, మే 17న కాలికట్ (కోజికోడ్) చేరుకున్నాడు.
📌 నోట్: నేటి కేరళలోగల కాలికట్ ‘మలబారు తీరం’ లో ఉంది. నాటి కాలికట్ పరిపాలకుడు జామోరిన్.
- 👥 వాస్కోడిగామాతో 64 మంది నావికులు, 3 నౌకలు వచ్చాయి.
- 🚢 Sao Gabriel – Vascodagama
- 🚢 Sao Rafel – Paulo dagama
- 🚢 Caravel Berrio – Nicalau colho
- 📍 వాస్కోడిగామా ప్రయాణించిన మార్గానికి గల పేరు- Cape root.
- 🔄 వాస్కోడిగామా రెండవసారి భారతదేశానికి 1502, అక్టోబర్ లో తన సోదరుడైన ‘ఎస్టవోడాగామా’ తో కాలికట్ వచ్చాడు. ఇతను 1524, డిసెంబర్ 24న కోచ్చిలో మలేరియా వ్యాధితో మరణించాడు. ఇతనికి కొచ్చిలోని St. Francis Anthony’s చర్చి వద్ద సమాధి చేశారు. 1539లో ఈ సమాధిని లిస్బన్‌కు మార్చారు.
ఐరోపా వాసుల రాక 🗓️
| 🇮🇳 భారతదేశానికి | 🌾 ఆంధ్ర దేశానికి |
|---|---|
| 1. పోర్చుగీసువారు (క్రీ.శ.1498) | 1. డచ్ వారు (క్రీ.శ.1605) |
| 2. డచ్ వారు (క్రీ.శ.1605) | 2. బ్రిటీష్ వారు (క్రీ.శ.1611) |
| 3. బ్రిటీష్ వారు (క్రీ.శ.1608) | 3. ఫ్రెంచ్ వారు (క్రీ.శ.1669) |
| 4. ఫ్రెంచ్ వారు (క్రీ.శ.1668) | 4. పోర్చుగీసువారు (క్రీ.శ.1670) |
1. పోర్చుగీసువారు (1498) 🇵🇹
- 🥇 భారతదేశానికి వచ్చిన మొదటి ఐరోపా వారు పోర్చుగీసువారు. (వాస్కోడిగామా 1498, మే 17న కాలికట్ చేరుకున్నాడు)
- 👑 ఆ కాలం నాటి కాలికట్ రాజు “జామెరిన్”. ఇతని అసలు పేరు “రాజుమను విక్రమవర్మన్”. ఇతని బిరుదు సముద్రిక. రాజధాని పొన్నవి.
- 🕌 ఆ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ “సికిందర్ లోడి”.
- 🛕 అప్పటి విజయనగర రాజు “ఇమ్మడి నరసింహరాయలు”.
- 📍 భారతదేశంలో పోర్చుగీసువారి యొక్క మొదటి వ్యాపార స్థావరం కాలికట్ (క్రీ.శ. 1500).
- 🏢 పోర్చుగీసు వ్యాపార కంపెనీకి గల పేరు ఎస్టాడో ఇండియా.
- 🏛️ పోర్చుగీసు వారి ప్రధాన వ్యాపార స్థావరం కొచ్చిన్.
📌 నోట్: 1501 లో స్థావరం, 1502 లో హెడ్ క్వార్టర్స్ చేయబడింది.
- 🎯 పోర్చుగీసువారు పశ్చిమతీర ప్రాంతంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు.
🌅 పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు:
- 🏰 కొచ్చిన్ (1502)
- 🏰 కన్ననూర్ (1503)
- 🏰 గోవా (1510)
- 🏰 డయ్యూ (1509)
- 🏰 కాలికట్ (1531)
- 🏰 డామన్
⚓ బెంగాల్ లో పోర్చుగల్ వ్యాపార స్థావరాలు:
- 🚢 హుగ్లీ – పోర్ట్ పిక్వియానో
- 🚢 సత్గావ్ – పోర్ట్ లిటిల్
- 🚢 చిట్టగాంగ్ – పోర్ట్ గ్రాండ్
