రాజ్యాంగ పరిణామక్రమ చరిత్ర

రాజ్యాంగ పరిణామక్రమ చరిత్ర

👉 రాజనీతిశాస్త్ర పితామహునిగా అభివర్ణింపబడే వ్యక్తి “అరిస్టాటిల్” (Aristotle)

👉 ప్రపంచంలో సుమారు 157 దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన వ్యక్తి – అరిస్టాటిల్

👉 అరిస్టాటిల్ రచించిన ప్రముఖ గ్రంథాలు-

1. Politics

    1. (Nicomachean Ethics)
    1. (The Philosophy of Aristotle)
    1. (The Metaphysics)

👉 అరిస్టాటిల్ యొక్క గురువు- “ప్లేటో” (Plato)

👉 ప్లేటో యొక్క గురువు- “సోక్రటీస్” (Socrates)

👉 ప్లేటో ప్రముఖ రచనలు: 1) రిపబ్లిక్ 2) దిలాస్ 3) అపాలజీ

(ప్లేటో రచించిన అపాలజీ గ్రంథాన్ని)

(ఈ రచనను గుజరాతీ భాషలోకి అనువదించినది గాంధీ)

👉 “తత్వవేత్తల పాలన శ్రేష్టమైనది”- ప్లేటో

👉 “చట్టబద్దమైన పాలన లేదా రాజ్యాంగబద్ధ పాలన శ్రేష్టమైనది”- అరిస్టాటిల్

👉 “ప్రభుత్వం మరియు అది పనిచేసే నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం“- లార్డ్ బ్రైస్

సమాఖ్య ప్రభుత్వం: (Federal Government)

👉 కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ చేయబడిన ప్రభుత్వం

👉 అతి తక్కువ సమయంలో రాజ్యాంగాన్ని రూపొందించుకొన్న దేశం- అమెరికా (4 నెలలలోపు)

👉 అధికారాలన్ని కేంద్రం వద్దనే కేంద్రీకృతమయిన ప్రభుత్వం

👉 అనగా రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు.

ఉదా: ఇంగ్లాండ్

దృఢ రాజ్యాంగం (Rigid Constitution): –

👉 రాజ్యాంగాన్ని సవరించటం కష్టసాధ్యంగా ఉన్నట్లయితే లేదా సవరించటానికి అధిక మెజార్టీ అవసరమయితే ఆ రాజ్యంగ స్వభావం దృఢమైనది.

ఉదా: అమెరికా దేశ రాజ్యాంగం.

అదృఢ రాజ్యాంగం :- Based on the document provided, here is the Telugu text from Page 2 exactly as it appears:


👉 రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి సులభంగా ఉన్నట్లయితే అనగా తక్కువ మెజార్టీతో సవరించడానికి వీలుగా ఉన్నట్లయితే ఆ రాజ్యాంగ స్వభావం అదృఢం.

ఉదా: ఇంగ్లాండ్

👉 ఇంగ్లాండ్లో రాజ్యాంగం అనేది లిఖిత రూపంలో లేదు.

👉 ఇంగ్లాండ్ పార్లమెంటు రూపొందించే చట్టాలే రాజ్యాంగంవలె చలామణి అవుతాయి.

ప్రభుత్వంలోని ముఖ్యమైన అంశాలు (Parts of the Government):-

  1. శాసనసభ (శాసనాలను రూపొందిస్తుంది)
  2. కార్యనిర్వాహక శాఖ (శాసనాలను అమలుపరచడం)
  3. న్యాయశాఖ (వివాదాలను పరిష్కరించటం)

👉 ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం “భారతదేశం

👉 చారిత్రక పరిణామాల ద్వారా చట్టాలను రూపొందించుకున్న దేశం “ఇంగ్లాండ్

👉 ప్రసాదిత రాజ్యాంగానికి ఉదా:- డెన్మార్క్ దేశ రాజ్యాంగం

👉 ఆమోదిత రాజ్యాంగానికి ఉదా:- భారతదేశ రాజ్యాంగం (Adapted Constition)


భారతదేశానికి బ్రిటీష్ వారి రాక

(MODEL QUESTIONS)

(1) భారతదేశానికి వ్యాపార నిమిత్తం జహంగీర్ అనుమతి కోరిన ఇంగ్లాండ్ దేశ కంపెనీ (ఎ)

ఎ) మర్చంట్ ఆఫ్ అడ్వెంచర్స్

బి) బెన్నింట్ కొలమాన్ కంపెనీ

సి) బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ

డి) ఏదీకాదు

(2) భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం (ఎ)

ఎ) 1773 చార్టర్ చట్టం

బి) 1813 చార్టర్ చట్టం

సి) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన

డి) ఏదీకాదు


👉 1608లో “సూరత్’తో వ్యాపార నిర్వహణకై “జహంగీర్” నుండి అనుమతి పొందిన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి “విలియం హాకింగ్స్

👉 విలియం హాకింగ్స్కు జహంగీర్ ఇచ్చిన బిరుదు – ఖాన్

👉 1615లో పన్ను చెల్లించి దేశంలో ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకొనే విధంగా అనుమతి పొందిన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి “థామస్ రో

👉 1639లో బ్రిటీష్ వారు 3వ వెంకటపతి రాయలు నుంచి కొనుగోలు చేసిన ప్రాంతం- “మద్రాసు

👉 మద్రాసు కొనుగోలులో మధ్యవర్తిత్వం నిర్వహించినవారు- “దామెర్ల, వెంకటాద్రి సోదరులు

వీరి తండ్రి- చెన్నప్ప, ఈయన పేరు మీదగానే “చెన్నపట్నం” ఏర్పడింది.

👉 1668లో పోర్చుగీసువారి నుంచి బాంబే ప్రాంతాన్ని బ్రిటీష్ వారు వైవాహిక సంబంధాల ద్వారా స్వాధీనం చేసుకొని నిర్మించిన కోట- “బాంబే కోట” (సెయింట్ డేవిడ్ కోట)

👉 1698లో “మిల్లత్” అనే జమీందారి నుంచి బ్రిటీష్ వారు కొనుగోలు చేసిన ప్రాంతం- “కలకత్తా”.

  1. ↩︎

👉 కలకత్తాలో బ్రిటీష్ వారు నిర్మించిన కోట – పోర్ట్ విలియం కోట

👉 1717లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి “బంగారు ఫర్మానా లేదా ఫ్రీదస్తక్” జారీ చేసిన మొగల్ చక్రవర్తి- ఫరూక్ సియర్

👉 ఫ్రీదస్తక్ లేదా బంగారు ఫర్మానా అనగా- ఎలాంటి శిస్తూ చెల్లించకుండా దేశంలో ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకొనే విధంగా స్వేచ్ఛని పొందడం.


MODEL QUESTION

1) భారతదేశంలో బ్రిటీషు సామ్రాజ్య అభివృద్ధికి కారణమైన యుద్ధం (బి)

ఎ) ప్లాసీ యుద్ధం

బి) బక్సార్ యుద్ధం

సి) వందవాసి యుద్ధం

డి) ఏవీకావు

2) భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపనకు పునాది అయిన యుద్ధం? (ఎ)

ఎ) ప్లాసీ యుద్ధం

బి) బక్సార్ యుద్ధం

సి) వందవాసీ యుద్ధం

డి) ఏదీకాదు


👉 “కలకత్తా చీకటిగది ఉదంతం” సంఘటన కాలం – 1756

👉 భారత్లో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం- ప్లాసీ యుద్ధం

సిరాజుదౌలా- బ్రిటీష్ సేనాని రాబర్ట్ క్లైవ్ల మధ్య జరిగిన యుద్ధమే ప్లాసీ.

👉 ప్లాసీ యుద్ధకాలం – 1757 జూన్ 23

👉 ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబుగా ప్రకటింపబడిన వ్యక్తి- ‘మీర్ జఫర్

👉 భారత్లో బ్రిటీష్ సామ్రాజ్య అభివృద్ధికి కారణమైన యుద్ధం- ‘బక్సార్ యుద్ధం‘ (1764, అక్టోబర్ 22)

👉 బక్సార్ యుద్ధానికి నాయకత్వం వహించిన బ్రిటీష్ సేనాని “హెక్టర్ మన్రో

👉 బక్సార్ యుద్ధం ముగియడానికి కారణమైన సంధి లేదా ఒప్పందం – “అలహాబాద్ సంధి” – 1765- అలహాబాద్.

👉 బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన వ్యక్తి- రాబర్ట్ క్లైవ్

👉 1772లో భారత్లోని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలపై ఇంగ్లాండ్ పార్లమెంటుకు రహస్య నివేదిక సమర్పించిన బ్రిటీష్ ఇంటెలిజెన్స్ అధికారి “జనరల్ బూర్గోయిన్

👉 భారత్లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడంలో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వం లేదా పార్లమెంటు ఈ క్రింది చట్టాలను రూపొందించింది.


1773 రెగ్యులేటింగ్ చట్టం :-

ముఖ్యాంశాలు:-

👉 ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని “బెంగాల్ గవర్నర్ జనరల్ గా” మార్చారు.

👉 మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్- వారన్ హేస్టింగ్స్

👉 ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో నలుగురు సభ్యులు నియమింపబడ్డారు.

  1. క్లావెరింగ్
  2. బార్వెల్
  3. ఫిలిప్ ఫ్రాన్సిస్
  4. మాన్సన్
Share This Article
Follow:
Master In Technology,