భారతదేశానికి యూరోపియన్ల రాక


1. భారతదేశానికి యూరోపియన్ల రాక 🚢

  • 🌍 ఐరోపా ఆసియా దేశాలపై ఆధారపడుటకు గల ప్రధాన కారణం ‘సుగంధ ద్రవ్యాలు (Spices)’.

📌 నోట్:

  • 🌶️ సుగంధద్రవ్యాల కార్రాజు, యవ్వన ప్రియా అని మిరియాలను పిలుస్తారు.
  • 🌱 సుగంధద్రవ్యాల రాణి అని యాలకులను పిలుస్తారు.
  • 🏢 జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు (National Spice Board) ‘కోచ్చి’ లో కలదు.
  • 🏭 ఐరోపా ఆధునిక యుగ ఆరంభానికి ముఖ్య కారణం పారిశ్రామిక విప్లవం.

📌 నోట్:

  • 🗣️ పారిశ్రామిక విప్లవం అను పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి లూయి బ్లాంక్.
  • 🧵 పారిశ్రామిక విప్లవ ఫలితంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ లేదా జౌళి పరిశ్రమ.
  • 🚂 పారిశ్రామిక విప్లవం ఆధునిక ఆవిరియంత్రం కనుగొన్న అనంతరం వేగాన్ని అందుకొన్నది. (ఆవిరి యంత్రం – జేమ్స్ వాట్)
  • ⚙️ ఆధునిక ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది – జేమ్స్ వాట్.
  • 💡 Safty Lamp కనుగొన్నది – హంప్రిదేవి.
  • 🐪 ప్రాచీన కాలం నుండి భారతదేశానికి, ఐరోపా దేశాలకు భూ మార్గం ద్వారా వ్యాపారం నిర్వహించబడుతుండేది.
  • 🛣️ భారతదేశానికి, ఐరోపా దేశాలకు మధ్య ముఖ్య రహదారి సిల్క్ రూట్.
  • 🤝 మధ్యయుగంలో అరబ్బులు భారత్, చైనా దేశాలతో వ్యాపారాన్ని నిర్వహించేవారు.

📌 నోట్:

  • 🕊️ అరబ్బులను భారతీయ సంస్కృతి రాయబారులు అని వ్యవహరిస్తారు.
  • ⛵ ఆంధ్రదేశంలో చైనా ఓడలకు గల పేరు జోంగులు.
  • ⚔️ చివరి క్రూసేడు యుద్ధంలో తురుష్కులు టర్కీలోని కాన్స్టాంట్ నోపుల్ (ఇస్తాంబుల్) నగరంను క్రీ.శ.1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ (బైజంటైన్ చక్రవర్తి (కాన్స్టాంటైన్ XI)ని ఓడించి) ఆక్రమించి ఐరోపా, ఆసియా ఖండాల మధ్య గల భూ మార్గాన్ని మూసివేశారు.
  • 🚫 యూరోపియన్ వర్తకులు ఎవ్వరూ భారతదేశం (లేదా) తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించారు. దీనితో యూరోపియన్లు భారతదేశంతో నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనుటకు నిర్ణయించారు.

📌 నోట్:

  • ✝️☪️ క్రైస్తవులకు, ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలను “క్రూసేడులు” అంటారు. క్రూసేడు యుద్ధాలకు కారణమైన పవిత్రనగరాలు “పాలస్తీనా, జెరుసలేం, బెత్లహేం”.
  • 🏙️ కాన్స్టాంట్నోపుల్ నగరంను ప్రస్తుతం ఇస్తాంబుల్ అని వ్యవహరిస్తున్నారు.
  • 👑 కాలికట్ రాజు జామోరిన్ వాస్కోడిగామాకు స్వాగతం పలికి కావలసిన వస్తువులను బహుమతిగా ఇచ్చి యూరప్కు పంపించాడు. ఈ వస్తువులను తమ దేశంలో అమ్మగా 60 రెట్ల లాభం లభించింది.
  • 🌊 భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన మొట్టమొదటి ఐరోపా వారు “పోర్చుగీసువారు”.
  • 🤴 పోర్చుగల్ రాజు “ఇన్ఫాంటే హెన్రీ” మొదటగా యూరప్ నౌకాయానాన్ని ప్రోత్సహించాడు.

📌 నోట్:

  • 🏫 హెన్రీ పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేశాడు.
  • 🏅 హెన్రీకి ‘ది నేవిగేటర్’ అనే బిరుదు కలదు. (హెన్రీ – ది నేవిగేటర్)
  • 🗺️ హెన్రీ జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో దేశంను చేరుకొని సురక్షితంగా తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు.
  • 🌪️ క్రీ.శ.1483లో ఇండియాకు రావాలని బయలుదేరిన మొదటి పోర్చుగీసు వ్యక్తి “బర్తిలోమియో దయాజ్”. ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తుఫానులతో వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో డయాజ్ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయి ఈ ప్రాంతానికి “తుఫానుల అగాధం (ఆగ్రం) (Cape of Stroms)” అని పేరు పెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

📌 నోట్: తుఫానుల ఆగ్రంకు “కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good hope)” అని పేరు పెట్టినది “రెండవ జాన్ (పోర్చుగల్ చక్రవర్తి)”.

  • 🌎 క్రీ.శ.1492లో క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్ మహా సముద్రంలో తన దిశమారి కరేబియన్ దీవులను చేరుకొని ఆ దీవులకు “వెస్టిండీస్” అని పేరుపెట్టాడు.

📌 నోట్:

  • 🧭 కొలంబస్ పశ్చిమ తీరం గుండా బయలుదేరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే క్రమంలో బహుమాస్ దీవులకు (1493లో) చేరుకున్నాడు.
  • ❌ కొలంబస్ భారతదేశానికి బదులుగా అమెరికాను కనిపెట్టాడు.
  • ⛵ కొలంబస్ ఉపయోగించిన ముఖ్యనౌక- శాంతమారియా.
  • 🌍 ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి బహమాస్ దీవులకు చేరుకొని ఇది భారతదేశం కాదని ఒక నూతన ఖండం అని ప్రపంచానికి తెలియజేశాడు. అమెరిగో వెస్పూచి పేరుపై ఆ ప్రాంతానికి అమెరికా అని పేరు వచ్చింది.
  • ⚓ వాస్కోడిగామా భారతదేశంనకు సముద్ర మార్గంను కనుగొనుటకై పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి బయలుదేరి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకుని అక్కడ అబ్దుల్ మజీద్ (గుజరాతి నావికుడు) సహాయంతో 1498, మే 17న కాలికట్ (కోజికోడ్) చేరుకున్నాడు.

📌 నోట్: నేటి కేరళలోగల కాలికట్ ‘మలబారు తీరం’ లో ఉంది. నాటి కాలికట్ పరిపాలకుడు జామోరిన్.

  • 👥 వాస్కోడిగామాతో 64 మంది నావికులు, 3 నౌకలు వచ్చాయి.
  • 🚢 Sao Gabriel – Vascodagama
  • 🚢 Sao Rafel – Paulo dagama
  • 🚢 Caravel Berrio – Nicalau colho
  • 📍 వాస్కోడిగామా ప్రయాణించిన మార్గానికి గల పేరు- Cape root.
  • 🔄 వాస్కోడిగామా రెండవసారి భారతదేశానికి 1502, అక్టోబర్ లో తన సోదరుడైన ‘ఎస్టవోడాగామా’ తో కాలికట్ వచ్చాడు. ఇతను 1524, డిసెంబర్ 24న కోచ్చిలో మలేరియా వ్యాధితో మరణించాడు. ఇతనికి కొచ్చిలోని St. Francis Anthony’s చర్చి వద్ద సమాధి చేశారు. 1539లో ఈ సమాధిని లిస్బన్కు మార్చారు.

ఐరోపా వాసుల రాక 🗓️

🇮🇳 భారతదేశానికి🌾 ఆంధ్ర దేశానికి
1. పోర్చుగీసువారు (క్రీ.శ.1498)1. డచ్ వారు (క్రీ.శ.1605)
2. డచ్ వారు (క్రీ.శ.1605)2. బ్రిటీష్ వారు (క్రీ.శ.1611)
3. బ్రిటీష్ వారు (క్రీ.శ.1608)3. ఫ్రెంచ్ వారు (క్రీ.శ.1669)
4. ఫ్రెంచ్ వారు (క్రీ.శ.1668)4. పోర్చుగీసువారు (క్రీ.శ.1670)

1. పోర్చుగీసువారు (1498) 🇵🇹

  • 🥇 భారతదేశానికి వచ్చిన మొదటి ఐరోపా వారు పోర్చుగీసువారు. (వాస్కోడిగామా 1498, మే 17న కాలికట్ చేరుకున్నాడు)
  • 👑 ఆ కాలం నాటి కాలికట్ రాజు “జామెరిన్”. ఇతని అసలు పేరు “రాజుమను విక్రమవర్మన్”. ఇతని బిరుదు సముద్రిక. రాజధాని పొన్నవి.
  • 🕌 ఆ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ “సికిందర్ లోడి”.
  • 🛕 అప్పటి విజయనగర రాజు “ఇమ్మడి నరసింహరాయలు”.
  • 📍 భారతదేశంలో పోర్చుగీసువారి యొక్క మొదటి వ్యాపార స్థావరం కాలికట్ (క్రీ.శ. 1500).
  • 🏢 పోర్చుగీసు వ్యాపార కంపెనీకి గల పేరు ఎస్టాడో ఇండియా.
  • 🏛️ పోర్చుగీసు వారి ప్రధాన వ్యాపార స్థావరం కొచ్చిన్.

📌 నోట్: 1501 లో స్థావరం, 1502 లో హెడ్ క్వార్టర్స్ చేయబడింది.

  • 🎯 పోర్చుగీసువారు పశ్చిమతీర ప్రాంతంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు.

🌅 పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు:

  • 🏰 కొచ్చిన్ (1502)
  • 🏰 కన్ననూర్ (1503)
  • 🏰 గోవా (1510)
  • 🏰 డయ్యూ (1509)
  • 🏰 కాలికట్ (1531)
  • 🏰 డామన్

⚓ బెంగాల్ లో పోర్చుగల్ వ్యాపార స్థావరాలు:

  • 🚢 హుగ్లీ – పోర్ట్ పిక్వియానో
  • 🚢 సత్గావ్ – పోర్ట్ లిటిల్
  • 🚢 చిట్టగాంగ్ – పోర్ట్ గ్రాండ్
Share This Article